ఖైదీలకూ సంతానోత్పత్తి హక్కు : దిల్లీ హైకోర్టు

-

తన భర్త ద్వారా సంతానాన్ని పొందే అవకాశం కల్పించాలని హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ ఖైదీ భార్య అభ్యర్థనపై దిల్లీ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఖైదీలకు కూడా పిల్లల్ని కనేందుకు, తమ వంశాన్ని నిలబెట్టుకునేందుకు హక్కు ఉంటుందని స్పష్టం చేసింది.  ఈ క్రమంలోనే ఆ ఖైదీకి నాలుగు వారాల పాటు పెరోల్‌ మంజూరు చేసింది.

భార్య వయసు 38 ఏళ్లు, భర్త వయసు 41 ఏళ్లను ప్రస్తావిస్తూ శిక్షా కాలం పూర్తయ్యాక ఆ దంపతులకు సంతానాన్ని పొందే వయసు మీరిపోతుందని, వయోభారం వారి ఉమ్మడి ఆకాంక్షకు అవరోధంగా మారుతుందని జస్టిస్‌ స్వర్ణ కాంత శర్మ అభిప్రాయపడ్డారు. తన భర్త ద్వారా సంతానాన్ని పొందాలన్న భార్య హక్కును ప్రభుత్వం అడ్డుకోలేదని తెలిపారు. ప్రస్తుత కేసులోని పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత ఖైదీకి తన వంశాన్ని నిలుపుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు దిల్లీ ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దాంపత్య జీవనం కోసం అనుమతివ్వడం లేదని, వంశాన్ని నిలబెట్టుకోవాలన్న భార్య ఆకాంక్షను, హక్కును గౌరవిస్తున్నట్లు తెలిపారు. పెరోల్‌ కోసం రూ.20 వేలకు వ్యక్తిగత బాండును సమర్పించడంతో పాటు ఒకరి పూచీకత్తు ఇవ్వాలని షరతు విధించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version