దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కాం లో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్లో పలు అంశాలను బయటపెట్టింది. ముడుపులు నగదు రూపంలో, హవాలా మార్గంలో తరలించినట్లు గుర్తించింది. లంచాలు కిక్ బాక్స్ నగదు రూపంలో హవాలా మార్గంలో తరలించినట్లు పేర్కొన్నారు. మద్యం పాలసీ రూపకల్పన జరుగుతున్న సమయంలోనే ఈ కుట్ర జరిగినట్లు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.
అభిషేక్ బోయినపల్లి 20 నుంచి 30 కోట్ల రూపాయల నగదును హవాలా మార్గంలో తరలించినట్లు చార్జీ షీట్ లో వెల్లడించింది. ఆ డబ్బంతా అడ్వాన్సుగా 2021 జూలై – సెప్టెంబర్ మధ్యకాలంలో ముట్టజెప్పినట్లు పేర్కొంది. 30 కోట్లను దినేష్ అరోరా ద్వారా విజయ్ నాయర్ కు అందజేసినట్లు తెలిపింది. అలాగే శరత్ చంద్రారెడ్డి, కల్వకుంట్ల కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి సౌత్ గ్రూప్ ను కంట్రోల్ చేశారని.. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది.