బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధించారంటూ మహిళా రెజర్లు చేసిన విషయం తెలిసిందే. బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్ విషయం కూడా తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై దిల్లీ పోలీసులు ఫోకస్ పెట్టారు. బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు.
అందులో భాగంగా ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలుంటే సమర్పించాలని రెజ్లర్లను దిల్లీ పోలీసులు కోరినట్లు సమాచారం. ఫొటోలు, వీడియోలు, వాట్సప్ సంభాషణలు ఏవి ఉన్నా తమకు అందజేయాలని పోలీసులు కోరినట్లు తెలిసింది. పోలీసులు కూడా సొంతంగా ఆధారాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. దిల్లీ పోలీసులు రెజ్లర్లకు సీఆర్‌పీసీ 91 నోటీసులు అందజేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీటి ప్రకారం కేసు విచారణకు అవసరమైన ఎలాంటి పత్రాలనైనా దర్యాప్తు అధికారి కోరవచ్చు. అందులో భాగంగా ఫిర్యాదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలున్నా తమకు అందజేయాలని ఆరోపణలు చేసిన రెజ్లర్లను కోరారు.