సూపర్ హిట్ సాంగ్​కు రాఖీ భాయ్​ డ్యాన్స్​.. వీడియో వైరల్

-

కేజీయఫ్ స్టార్ రాకీ భాయ్​ యశ్​ వెండితెరపై కనిపించి చాలా కాలం అయింది. కేజీయఫ్ 2 తర్వాత యశ్ సినిమాలేం విడుదల కాలేదు. అసలు ఆ తర్వాత యశ్ మరే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. యశ్ సినిమా కోసం యావత్ ఇండియా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అయితే సోషల్ మీడియాలో.. పలు ఈవెంట్లలో యశ్ అప్పుడప్పుడు కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. అయితే తాజాగా యశ్​ ఓ వేడుకలో డ్యాన్స్​లు వేస్తూ సరదాగా కనిపించారు. తన తోటి హీరో దర్శన్​తో కలిసి చిందులేశారు. అది చూసిన నెటిజన్లు, అభిమానులు ఎంతో సంతోషపడిపోతున్నారు. తెగ మురిసిపోతున్నారు. ఆ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు.

సీనియర్‌ నటి, ఎంపీ సుమలత కుమారుడు అభిషేక్‌ వివాహం రీసెంట్​గా గ్రాండ్​గా జరిగింది. బెంగుళూర్‌లోని ఓ ప్యాలెస్‌లో.. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రసాద్‌ బిదపా కుమార్తె అవివాతో అతడి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో సుమలత.. తాజాగా ఓ గ్రాండ్‌ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి నటీ నటులంతా హాజరై సందడి చేశారు. అందులోనే స్టార్‌ హీరోలు యశ్‌-దర్శన్‌లు.. సుమలత, కొత్త జంటతో కలిసి స్టేజ్​పై చిందులేశారు. ఒ వీరంతా కలిసి విజయ్‌ప్రకాశ్‌ హిట్‌ సాంగ్‌ ‘ హే జలీల’ సాంగ్​కు.. స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version