ఆ కేసులో నోటీసులు ఇచ్చేందుకు.. దిల్లీ మంత్రి ఇంటికి క్రైం బ్రాంచ్‌ పోలీసులు

-

ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని గత నెల 27వ తేదీన ఆప్ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మంత్రి అతిశీ ఆరోపణలు చేశారు. ఒక్కో సభ్యుడికి రూ.25 కోట్లు ఇస్తామని ఆశచూపి వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా ఆఫర్ చేసినట్లు ఆరోపించారు. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన బీజేపీ ఆధారాలు చూపించాలని కేజ్రీవాల్ కు సవాల్ విసురుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై నోటీసులు అందించేందుకు దిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఈరోజు మంత్రి ఆతిశీ  ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేరని.. నోటీసులు అందజేయడానికి మరోసారి వస్తామని ఓ అధికారి తెలిపారు. తమ కార్యాలయ సిబ్బందికి వాటిని అందించాలని ఆతిశీ కోరినా.వారు నిరాకరించినట్లు సమాచారం.

అయితే ఇదే కేసు దర్యాప్తులో భాగంగా సీఎం కేజ్రీవాల్‌కు  క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు శనివారం నోటీసు అందజేసిన విషయం తెలిసిందే. ఆరోపణలకు సంబంధించి మూడ్రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version