ఆటో డ్రైవరన్న.. ఆత్మహత్యలు వద్దన్నా – హరీష్‌ రావు

-

ఆటో డ్రైవరన్న.. ఆత్మహత్యలు వద్దన్నా అంటూ మాజీ మంత్రి హరీష్‌ రావు కోరారు. సంగారెడ్డి పటాన్ చేరులో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా పటాన్ చెరు బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు హరీష్ రావు. ఆటో EMI కట్టలేకపోతున్నామని హరీష్ రావుకి చెప్పారు ఆటో డ్రైవర్లు.

Former minister Harish Rao’s visit to Patan Cheru

అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ….ఆటో డ్రైవర్లు ఎవరు అధైర్య పడవద్దు..ధైర్యంగా ఉండండి కాపాడుకుంటామన్నారు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్ల తరుపున అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ గళం విప్పుతుందని తెలిపారు. ఆత్మహత్యలు వంటి తొందరపాటు నిర్ణయాలు వద్దని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు 10 వేలు ఇచ్చేదాక పోరాటం చేద్దామని చెప్పారు మాజీ మంత్రి హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version