దిల్లీలో మరోసారి ప్రమాదకర స్థాయిని తాకిన వాయు కాలుష్యం

-

దీపావళి ముందు కాస్త తగ్గుముఖం పట్టిన వాయు కాలుష్యం దిల్లీని మళ్లీ ఆందోళనకు గురి చేస్తోంది. రోజురోజుకు ప్రమాదకర స్థాయికి చేరుతూ నగర ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కట్టడి చర్యలు తీసుకుంటున్నా.. శీతాకాలం కావడంతో వాయు కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. దేశ రాజధాని హస్తినలో ఇవాళ ఉదయం వాయు నాణ్యత సూచీ 401గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత ఆదివారం నమోదైన వాయునాణ్యత సూచీ 301తో పోల్చితే 100 పాయింట్లు పెరిగిందని చెప్పారు.

ఉష్ణోగ్రతలు తగ్గడం, గాలి వేగం మందగించడంతో కాలుష్య కారకాలు పేరుకపోయి గాలి స్వచ్ఛత దారుణంగా పడిపోయిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దిల్లీ సమీప ప్రాంతాలైన గాజియాబాద్‌, గురుగ్రామ్‌ , గ్రేటర్‌ నోయిడా, నోయిడా, ఫరీదాబాద్‌లల్లో కూడా వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిల్లో నమోదవుతోందని తెలిపారు. ముఖ్యంగా ఫరిదాబాద్‌లో వాయునాణ్యత సూచీ 410 గా నమోదైనట్లు చెప్పారు. రాబోయే ఐదు నుంచి ఆరు రోజుల పాటు వాయు కాలుష్యం తీవ్రంగా పెరగనుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నగర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news