ఇదేంద‌య్యా ఇదీ.. లోన్ తీసుకోకున్నా క‌ట్టాలా..? ధ‌ని యాప్ నిర్వాకం..!

Join Our Community
follow manalokam on social media

సాధార‌ణంగా మ‌నం ఏ ఫైనాన్స్ కంపెనీ అయినా లేదా బ్యాంక్ నుంచైనా లోన్ తీసుకుంటే నెల‌వారీ వాయిదాల‌ను స‌రిగ్గా చెల్లించ‌క‌పోతే వారు మెసేజ్‌లు పెడ‌తారు. మెయిల్స్ పంపుతారు. కాల్స్ చేస్తారు. అది క‌రెక్టే. కానీ లోన్ తీసుకోక‌పోయినా.. మీరు ఫ‌లానా మొత్తం బాకీ ఉన్నారు. వెంట‌నే క‌ట్టండి. పెండింగ్ మొత్తాన్ని క్లియ‌ర్ చేయండి.. అంటూ మెసేజ్‌లు వ‌స్తే ఎలా ఉంటుంది ? చిర్రెత్తుకు వ‌స్తుంది క‌దా. అవును.. గ‌త రెండు, మూడు రోజుల నుంచి కొంద‌రు యూజ‌ర్ల ప‌రిస్థితి స‌రిగ్గా ఇలాగే ఉంది. ఎందుకంటే..

dhani app recklessness sent messages to users even they did not took loans

ప్ర‌స్తుతం మ‌న‌కు ఇన్‌స్టంట్ రుణాల‌ను అందించే యాప్‌లు ఎక్కువ‌గానే అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ధ‌ని అనే యాప్ కూడా ఒక‌టి. ఇందులో రుణాల‌తోపాటు ప‌లు ఇత‌ర సేవ‌ల‌ను కూడా అందిస్తున్నారు. అయితే గ‌త రెండు, మూడు రోజుల కింద‌ట చాలా మంది యూజ‌ర్ల‌కు ఈ యాప్ నుంచి విప‌రీతంగా మెసేజ్‌లు వ‌చ్చాయి. మీరు లోన్ తీసుకున్నార‌ని, వెంట‌నే ఆ మొత్తాన్ని చెల్లించాలంటూ ధ‌ని యాప్ నుంచి చాలా మంది యూజ‌ర్ల‌కు మెసేజ్‌లు వెళ్లాయి. దీంతో చాలా మంది ఖంగు తిన్నారు.

అస‌లు అందులో అకౌంట్ లేని వారికి కూడా ఆ మెసేజ్‌లు వెళ్లాయి. ఇక కొంద‌రు లోన్ చెల్లించామ‌ని, అయినా ఆ మెసేజ్‌లు వ‌చ్చాయ‌ని చెప్పారు. కొంద‌రు ఆ యాప్‌ను వాడ‌డం లేద‌ని, అస‌లు లోనే తీసుకోలేద‌ని, అయినా మెసేజ్‌లు వ‌చ్చాయ‌ని అన్నారు. దీంతో చాలా మంది యూజర్లు పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ గ‌ళం వినిపించారు. చివ‌ర‌కు స‌ద‌రు యాప్ నిర్వాహ‌కులు స్పందించారు. సాంకేతిక స‌మ‌స్య వ‌ల్లే ఇలా జ‌రిగింద‌ని, త‌మ‌ను క్ష‌మించాల‌ని కోరారు. అయితే అందులో రిజిస్ట‌ర్ అయిన వారికి మెసేజ్‌లు వెళ్లాయంటే ఓకే.. కానీ అస‌లు అకౌంట్ లేని వారికి కూడా మెసేజ్‌లు ఎలా వెళ్లాయి ? అనే దానిపై వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. మ‌రి దీని వెనుక మ‌త‌ల‌బు ఏమై ఉంటుందో ఆ దేవుడికే తెలియాలి.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...