పాలు మరియు పాలకు సంబంధించిన ఇతర ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని పెంచిన సంగతి తెలిసిందే. అయితే దీనికి నిరసనగా దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు… కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. జీఎస్టీ, నిత్యావసరాల వస్తువుల ధరలు పెంపునకు నిరసనగా కాంగ్రెస్ మరియు టిఆర్ఎస్ పార్టీలు పార్లమెంట్ ఆవరణలో నిరసనకు దిగాయి.
ఈ ధర్నాలో రాహుల్ గాంధీ పాల్గొనగా… ఆయన పక్కనే కేకే నిల్చోని మరి తమ నిరసనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అన్ని పార్టీలను కలుపుకుని పోతామని రెండు పార్టీలు చెబుతున్నాయి. ఇక అటు పాలు, పాల అనుబంధ ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా నేడు టిఆర్ఎస్ పార్టీ నిరసనలు తెలపనుంది. ఈ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు. పాలు మరియు పాల ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి GST పన్ను విధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు ఆందోళనలు చేపట్టాలని కోరారు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు.