సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు ఇండియా కూటమిని రాజకీయంగా విమర్శలకు గురి చేస్తున్న క్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా వివాదస్పదంగా మాట్లాడారు. చొక్కా తీసేయాలని అడిగినందుకు కేరళలోని దేవాలయానికి తాను వెళ్లలేదని చెప్పారు. ఒకానొక సమయంలో కేరళలో ఉన్నటువంటి ఓ దేవాలయానికి తాను వెళ్లాను. ఆ ఆలయంలోకి ప్రవేశించాలంటే.. తాను చొక్కా తీసేయాలని కోరారు.
దీంతో ఆ సమయంలోనే నేను దేవాలయంలోకి వెళ్లడమే మానేశాను అంటూ చెప్పుకొచ్చాడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. తనను ఒక్కడినే చొక్కా తీసేయాలని కోరారు తప్ప అక్కడ ఉన్నవారిలో ఎవ్వరినీ కూడా అలా అడుగలేదు. దీంతో తాను ఆశ్చర్యపోయాను. దేవుడి ముందు ఇది చాలా అమానవీయమైన పద్దతి అన్నారు. భగవంతుని వద్ద అందరూ సమానులే అని తెలిపారు సీఎం సిద్దరామయ్య. కర్ణాటకలో నిర్వహిస్తున్న నారాయణ గురు 169వ జన్మదిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో దేవాలయంలోకి ప్రవేశించే ముందు చొక్కా తీసేయడం ఆనవాయితీగా వస్తోంది. శరీరంపై చొక్కాకు బదులు భుజాల మీదుగా అంగవస్త్రాన్ని ధరిస్తారు.