చారిత్రాత్మక విజయంతో సిరీస్ కొల్లగొట్టిన శ్రీలంక మహిళలు !

-

శ్రీలంక క్రికెట్ మహిళల జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా రెండు జట్ల మధ్య మూడు టీ 20 లు మరియు మూడు వన్ డే లు జరగనున్నాయి. ఇప్పటికే టీ 20 సిరీస్ పూర్తి కాగా , అందులో రెండు మ్యాచ్ లు శ్రీలంక గెలుచుకోగా కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే ఇంగ్లాండ్ విజయాన్ని అందుకుంది. సొంతగడ్డపై ఇంగ్లాండ్ సిరీస్ ను ఓడిపోవడంతో చరిత్ర సృష్టించింది శ్రీలంక. నిన్న జరిగిన మూడవ వన్ డే నిర్ణయాత్మకమైనది కాగా టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు కేవలం 116 పరుగులకే ఆల్ అవుట్ అయింది. శ్రీలంక బౌలర్లలో కెప్టెన్ అథాపట్టు మూడు , ప్రభోధిని రెండు మరియు దిల్హారి రెండు వికెట్లు పడగొట్టారు. 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక
17 ఓవర్ లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

కెప్టెన్ ఆటపట్టు మరోసారి ముందుండి గెలుపు దిశగా శ్రీలంకను నడిపించింది. ఈ విజయంతో చరిత్రలో ఇంగ్లాండ్ పై టీ 20 సిరీస్ ను గెలుచుకుని రికార్డ్ సృష్టించింది.

Read more RELATED
Recommended to you

Latest news