ఢిల్లీలో ఈరోజు నుంచి కొత్త నిబంధన అమలులోకి వచ్చింది. కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం ఇవ్వమని స్పష్టం చేసింది ప్రభుత్వం. పెట్రోల్ వాహనాలు 15 సంవత్సరాలు, డీజిల్ వాహనాలు 10 సంవత్సరాలు దాటితే ఇంధనం ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయాన్ని పెట్రోల్ బంకుల వద్ద ప్లెక్సీలు ఏర్పాటు చేసి మైకుల ద్వారా ఢిల్లీ ప్రభుత్వం అనౌన్స్ చేస్తోంది. నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినట్లయితే వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.