ఈవీఎంలు వద్దు… బ్యాలెట్ పేపర్లు ముద్దు – డీకే శివకుమార్

-

ఈవీఎంలు వద్దు… బ్యాలెట్ పేపర్లు ముద్దు అన్నారు డీకే శివకుమార్. ఈవీఎంల పనితీరుపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో BJP-JDS కూటమి అత్యధిక సీట్లు గెలవడానికి EVMలే కారణమని ఆరోపించారు. EVMలను తీసేసి….మళ్లీ పోస్టల్ బ్యాలెట్ విధానం తేవాలని డిమాండ్ చేశారు.

DK Shivakumar On EVMs Caste Politics in Karnataka

మధ్యప్రదేశ్ లో 29 సీట్లకు గాను BJP 29 చోట్ల గెలవడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోందన్నారు. కాగా, కర్ణాటకలో బీజేపీ 17, జేడిఎస్ 2, కాంగ్రెస్ 11 చోట్ల నెగ్గాయి. అటు రాబోయే ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు.. పేపర్ బ్యాలెట్ ముద్దు అనే నినాదాన్ని ఫాలో కావాలని సూచించారు సీపీఐ నారాయణ. ఈవీఎంలు వినియోగించకుండా.. బ్యాలెట్ పద్దతీలోనే ఏ ఎన్నికలైనా నిర్వహించాలని సూచించారు. ఈ విషయం పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news