భారత్‌పై మరో టారిఫ్ బాంబ్ పేల్చారు డొనాల్డ్ ట్రంప్. తాజాగా మరోసారి 25% సుంకాలు పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 25% సుంకాలు విధించారు. ఇప్పుడు దాన్ని 50%కి పెంచిన ట్రంప్… షాక్ ఇచ్చారు.

ఆగస్టు 27వ తేదీ నుంచి తాజా టారిఫ్ అమల్లోకి రానుందని సమాచారం అందుతోంది. రష్యా నుంచి ఇప్పటికీ చమురుని కొనుగోలు చేస్తోందన్న కారణంతోనే.. భారత్‌పై ఇలా సుంకాల మోత మోగించేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మరి.. తన స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న ఈ టారిఫ్‌లపై మోదీ స్పందన ఏంటో? అంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది.