ఓవైపు తుపాను మరోవైపు భూకంపం.. భయంగుప్పిట్లో తమిళజనం

-

ఓవైపు మిగ్​జాం తుపాను సృష్టించిన బీభత్సాన్ని ఇంకా మరవకముందే.. మరోవైపు భూకంపం తమిళనాడు ప్రజలను భయకంపితులన్ని చేస్తోంది. ఇవాళ ఉదయం తమిళనాడులో భూప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో ఉదయం 7:39 గంటలకు రిక్టర్​ స్కేలుపై భూకంప తీవ్రత 3.2గా నమోదైందని అధికారులు తెలిపారు. 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించారు.

మరోవైపు తమిళనాడుతో పాటు గంటల వ్యవధిలోనే మరో మూడు రాష్ట్రాల్లో భూకంపాలు సంభవించాయి. గుజరాత్​, మేఘాలయతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల్లో నేషనల్ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ భూప్రకంప కేంద్రాలను గుర్తించింది. గుజరాత్​లోని కచ్​ ప్రాంతంలో కూడా శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 3.9 తీవ్రతతో భూమి కంపించగా.. మేఘాలయ రాజధాని షిల్లాంగ్​లో కూడా ఉదయం 8:46 గంటల సమయంలో 3.8 తీవ్రతతో భూమి కదిలిందని అధికారులు తెలిపారు. కర్ణాటక విజయపుర జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా శుక్రవారం ఉదయం 6.52 గంటలకు భూక్రంపనలు సంభవించాయి. ఇక్కడ రిక్టర్​ స్కేల్​పై 3.0 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు కర్ణాటక రాష్ట్ర ప్రకృతి విపత్తు పర్యవేక్షణ కేంద్రం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news