సీఎం జగన్ పై రేవంత్ రెడ్డి సంచలన పోస్ట్ చేశారు. సీఎం జగన్ మోహన్‌రెడ్డి చేసిన ట్వీట్ కు రిప్లై ఇచ్చారు రేవంత్ రెడ్డి. శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తో పాటు, పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం… అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆకాంక్షిస్తోందన్నారు రేవంత్ రెడ్డి. ఇక అంతకు ముందు.. రేవంత్ రెడ్డికి శుభ కాంక్షలు చెప్పారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు అన్నారు సీఎం జగన్.. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.