నేడు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నీట్, నెట్ పరీక్ష పేపర్ల లీక్ అంశాలపై విద్యార్థి సంఘాల నిరసనలు చేయనున్నారు. ఎన్టీఏను సంస్కరించాలనే డిమాండ్‌తో విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగనున్నాయి. ఈ నేపథ్యంలో బంద్ పిలుపుతో ఇప్పటికే పలు విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి.
నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా ఇవాళ (జులై 4న) విద్యా సంస్థల భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు అందుకూ ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పిలుపునిచ్చారు. నీట్ పేపర్ లీకేజీపై కేంద్రం ఇప్పటివరకు స్పందించలేదని.. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్‌పైన ఉందని అన్నారు. ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చి నీట్ పరీక్షను రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజితో కేంద్రం నిర్వహించే ప్రతి పరీక్షపైన అనుమానం కలుగుతోందని బల్మూరి వెంకట్ అన్నారు.కేంద్రానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న విద్యా సంస్థల భారత్ బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.