మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ ఫైనల్ కానుంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ ఉండనుంది. ఈ సందర్భంగా జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం.
వాస్తవంగా మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నవంబర్, 2024లో ముగుస్తుంది. జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం జనవరి, 2025లో ముగుస్తుంది. ఈ తరుణంలోనే.. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ ఫైనల్ కానుంది. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుండగా, 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం జనవరి 5, 2025తో ముగియనుంది.మహారాష్ట్రలో, ఏక్‌నాథ్ సిండే నేతృత్వంలోని మహాయుతి కూటమి దాని మిత్రపక్షాలు — శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) మరియు ఎన్‌సిపి (అజిత్ పవార్ వర్గం)తో కలిసి మరో దఫా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.