అద్దెల ఆదాయం పొందడానికి.. ఇల్లు కొనడం మంచిదేనా..?

-

ఈరోజుల్లో చాలామంది కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నారు. నిజానికి సొంతింటి కల ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకోసం జీవితాంతం కష్టపడుతూ ఉంటారు. ఇల్లు కొనుగోలుదారులు రెండు రకాలుగా ఉంటారు. ఉండడం కోసం కొంతమంది ఇల్లు కొనుగోలు చేస్తే.. అద్దె ఆదాయం కోసం మరి కొందరు ఇల్లుని కట్టుకుంటారు. చాలామంది ఎక్కువ ఆదాయాన్ని పొందేవాళ్ళు కంఫర్టబుల్ హౌస్ ని ముందు సమకూర్చుకుంటున్నారు. ఆ తర్వాత ఆదాయంతో రియల్ ఎస్టేట్ పై పెట్టుబడులు పెడుతున్నారు. పెట్టుబడులు స్థలాల మీద పెట్టే వాళ్ళు ఎక్కువ ఆదాయం కూడా ఉండాలని కొనుగోలు చేస్తున్నారు.

ఎక్కడైనా ఒక మంచి అపార్ట్మెంట్లో అద్దెకు ఇస్తే నెలకు 15 నుంచి 20 వేల వరకు వస్తుంది. కొంచెం 60 లక్షలు పెట్టుబడి పెడితే ఇలా ఇల్లు వచ్చేస్తోంది. దీర్ఘకాలికంగా చూస్తే ఆ ఇంటి విలువ పెరుగుతుంది. వచ్చే అద్దెల ఆదాయం కూడా పెరుగుతుంది. 10 ఏళ్ల తర్వాత ఇంటి విలువ పెరుగుతుంది. ఇంటి విలువ కోటి పైనే ఉంటుంది. అద్దె 30,000 వరకు పెరగొచ్చు.

పెట్టుబడితో పాటు ఆదాయం పెరుగుతూ పోతుంది. ఇలాంటివి పెట్టుబడి సురక్షితం. కానీ అప్పులు చేసి మాత్రం పెట్టొద్దు. లగ్జరీ ఇల్లు కొని అద్దెలకు ఇచ్చుకుంటే పదేళ్ల తర్వాత కూడా పెట్టుబడిని మాత్రమే రాబట్టుకోగలమని నిపుణులు అంటున్నారు. అంతే కానీ లగ్జరీ ఇళ్ళను కట్టేసి ఇల్లు అద్దెక్కించుకోవడం మంచిది కాదు. రెండు కోట్లు పెట్టుబడి పెట్టి నెలకి 50,000 అద్దె తీసుకున్న కూడా అది నష్టమే కాబట్టి ఇల్లు అద్దెకు ఇవ్వాలని అనుకునేవాళ్లు మరీ ఎక్కువ పెట్టి కట్టకూడదు. మాములుగా కట్టి అద్దెకు ఇచ్చుకుంటే నష్టం ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news