కరోనా హాట్‌ స్పాట్‌గా మారనున్న ఎన్నికల ర్యాలీలు

-

దేశంలో బీహార్‌ రాజకీయంతో పాటు మధ్యప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు అగ్రనేతల ప్రచారాలు, ర్యాలీలతో వేడెక్కింది. ఎలక్షన్ల సమయం దగ్గర పడే కొద్దీ ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి..అయితే ఎన్నికల సమయంలో ,ఎన్నికల తర్వాత వచ్చే ఉపద్రవంపై గురించి ఏ పార్టీ కూడా పట్టించుకోవడం లేదు..వేల సంఖ్యలో జనంతో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి..లక్షల సంఖ్యలో ర్యాలీలు నిర్వహిస్తున్నాయి..కాని బీహార్‌,మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ ఇచ్చిన గైడ్‌లైన్స్‌మాత్రం ఏ రాజకీయ పార్టీ పాటించినట్లు కడబడటం లేదు.. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలో కూడా అదే పరిస్థితి..
దీంతో భవిష్యత్‌లో దేశంలో ముఖ్యంగా బీహర్‌, మధ్యప్రదేశ్లో కరోనా కేసులు సంఖ్య గణనీయంగా పేరిగే ఆస్కారం ఉంది..ఎన్నికల్లో గెలిస్తే కరోనా వ్యాక్సిన్‌ ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో ప్రధాన పార్టీలు ముఖ్యంగా బీజేపీ ప్రకటించింది..ఎన్నికల ర్యాలీలో కరోనా గైడ్ లైన్స్‌ పాటించడకుండా వచ్చిన తర్వాత వ్యాక్సిన్‌ ఉచితంగా ఇస్తామంటే సామాజాని ఎలాంటి సందేశం ఇస్తున్నాయి పార్టీలు..
బీహార్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్డీయే-JDU కూటమి, కాంగ్రెస్‌-RJD కూటమి..విమర్శలు, ప్రతి విమర్శలతో హీటెక్కిస్తున్నాయి. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ దూకుడు పెంచడం..కాని కరోనా వ్యాప్తిని వారు విస్మరించారు..ర్యాలీలు, సభలలో ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదు..మాస్క్‌ ధరించడం లేదు..గుంపుగుంపులుగా ఒకరిపై ఒకరి తోసుకుంటూ కనిస్తున్నారు..

అందులో ఏ ఒక్కరిక కరోనా పాజిటివ్ ఉంటే అక్కడకి వచ్చిన లక్షల మందికి సోకే ప్రమాదం లేకపోలేదు..ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలు భవిష్యత్‌లో కరోనా హాట్‌స్పాట్ సెంటర్‌లుగా మారే ప్రమాదం ఉందుంటున్నారు నిపుణులు..గత కొద్దీ రోజులుగా రోజు వారీ కేసులు తగ్గుతున్నాయని, మరణాల రేటు తగ్గుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటిస్తుంది..చాలా మందిలో రోగనిరోధక శక్తి పెరిగిందని..రికవరీ రేటు పెరిగిందంటూ ప్రకటనలు ఇస్తుంది..కాని కరోనా వ్యాప్తి గురించి అంచన వేయడంలో విఫలమైందంటున్నారు వైద్య నిఫుణులు..చాలా దేశాలు ఇలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే వైరస్‌ వ్యాప్తి మళ్లీ పెరిగిందని..వారు మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తున్నారంటున్నారు వైద్యులు..
ఇప్పటకే రోజువారి కేసులతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు మళ్లీ వైరస్‌ వ్యాప్తిని పెంచే అవకాశాలు ఉన్నాయి..కరోనా వ్యాక్సిన్‌ పై అనేక పరిశోధనలు జరుగుతున్న ఫలితాలు మాత్రం సానుకూలంగా రావడంలేదు..మరో రెండేళ్ల వరకూ కరోనా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశాలు లేవని సీసీఎంబీ కుండబద్దలు కొట్టింది..ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఎన్నికల ప్రచారాలు అవసరమా? లక్షల సంఖ్యతో ర్యాలీలు ఎందుకు అని మేధావులు విమర్శిస్తున్నారు..పదవుల పరుగుపందెంలోపడి రాజకీయ పార్టీలు ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నారని..ఓటర్లను ఆకర్శించడానికి, వారిని ఆకట్టుకోవడానికి బహిరంగా సభలు, ర్యాలు చెపట్టకుండా, ప్రసార మాధ్యామాలను ఉపయోగంచుకోవాలి విశ్లేషకులు సూచిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news