పెట్రోల్ ధరలపై ట్విస్ట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్ ఎలాగ డీజిల్ ధరలపై లీటర్ కు రెండు రూపాయల చొప్పున విధించిన ఎక్సైజ్ డ్యూటీ పైన మోడీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ పెంపు ప్రజల పైన ఉండకూడదని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎక్సైజ్ సుంకం ఆయిల్ కంపెనీలో భరిస్తాయని వెల్లడించింది.

ఈ మేరకు రిటైల్ ధరల్లో మార్పులు చేయకూడదని ఆయిల్ కంపెనీలకు కేంద్రం సూచనలు చేయడం జరిగింది… అంటే దేశవ్యాప్తంగా పెట్రోల్ అలాగే డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని చెప్పగానే చెప్పింది కేంద్రం.
- పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఊరట కలిగించే వార్త
- పెట్రోల్, డీజిల్ ధరలపై పెంచిన రూ.2 ఎక్సైజ్ డ్యూటీపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
- ఈ పెంపు భారం ప్రజలపై ఉండదని వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
- ఎక్సైజ్ సుంకం ఆయిల్ కంపెనీలే భరిస్తాయని ప్రకటన
- ఈ మేరకు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం