ఎప్పుడైతే వాస్తు శాస్త్రంలో చెప్పిన నియమాలను పాటిస్తారో ఇంట్లో ఎంతో సానుకూల శక్తి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుండి బయటపడాలంటే తప్పకుండా వాటిని పాటించాలి. అంతేకాకుండా, ఏమైనా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు కూడా వాస్తు శాస్త్రంలో చెప్పిన విషయాలను తెలుసుకొని వాటి ప్రకారం కొనుగోలు చేయాలి. వెండి, బంగారం వంటి ముఖ్యమైన వస్తువులు మాత్రమే కాకుండా గ్యాస్ స్టవ్ వంటి వస్తువులకు కూడా మంచి రోజులు నిర్ణయించడం జరిగింది. అయితే ధన త్రయోదశి నాడు గ్యాస్ స్టవ్ ను కొనుగోలు చేస్తే ఎంతో మంచి జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు.
కాకపోతే గ్యాస్ స్టవ్ ను శనివారం లేక బుధవారం నాడు అస్సలు కొనుగోలు చేయకూడదు. ధన త్రయోదశి నాడు కొనుగోలు చేయడం కుదరకపోతే గురువారం రోజున గ్యాస్ స్టవ్ ని కొనుగోలు చేసుకోవచ్చు. అయితే గురువారం అనేది బృహస్పతి కి సంబంధించిన రోజు. అందువలన గ్యాస్ స్టవ్ ని బుధవారం నాడు కొనుగోలు చేయడం వలన ఎంతో మేలు ఉంటుంది అని వాస్తు శాస్త్రం చెబుతోంది. వంటగదిలో గ్యాస్ స్టవ్ ని ఆగ్నేయం వైపున ఉంచితే ఎంతో ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఉండే సమస్యలు తగ్గడానికి సహాయం చేస్తుంది. అంతేకాకుండా నైరుతి రాహువు కు సంబంధించిన దిశ అందువలన నైరుతిలో గ్యాస్ స్టవ్ ని పెట్టడం వలన కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా జీవిస్తారు.
ఒకవేళ ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే గ్యాస్ స్టవ్ ను పడమర లేక నైరుతి వైపు పెట్టవచ్చు. ఇలా చేయడం వలన ఆదాయం పెరుగుతుంది. దీంతో ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. జీవితంలో విజయాలను పొందాలని అనుకునేవారు గ్యాస్ స్టవ్ ని వాయువ్యం వైపు పెట్టాలి. ఇలా చేస్తే కష్టాలన్నీ తొలగిపోయి ఎన్నో విజయాలను పొందుతారు. ఈ విధంగా ఎంతో ఆనందంగా జీవిస్తారు. కనుక వాస్తు శాస్త్రంలో చెప్పిన నియమాలను తప్పకుండా పాటించండి. దీంతో మీకు ఉండేటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ఎంతో ఆనందంగా జీవిస్తారు.