Fact Check : ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లను ఇస్తోందా?

-

విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ల్యాప్ టాప్స్ ఇస్తోందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.దానికి సంబంధించి ఒక లింక్ అన్ని గ్రూపులో తెగ తిరుగుతోంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి అందులోని వివరాలను ఫిల్ చేస్తే త్వరలోనే ల్యాప్ టాప్స్ వస్తాయని కొందరు ఈ సమాచారాన్ని వైరల్ చేస్తున్నారు.తీరా అది నిజమా? కదా? అని చెక్ చేస్తే ఆ లింక్ ఫేక్ అని ఫ్యాక్ట్ చెక్ తేల్చింది.

ఈ మధ్యకాలంలో సైబర్ దాడులు, మోసాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే 2024 అకాడమిక్ ఇయర్‌కు చెందిన విద్యార్థులు, ఆర్థిక స్థోమత మెరుగ్గా లేని వారికి ప్రభుత్వం ఉచితంగా ల్యాప్ టాప్స్ ఇస్తోందని సమాచారంతో కూడిన ఓ లింక్ వైరల్ అవుతోంది. మొత్తం 9,60,000 విద్యార్థులకు ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందని అందులో పేర్కొన్నారు.దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా మొదలైందని, అప్లై చేసుకున్న వారికి త్వరలోనే ల్యాప్ టాప్స్ వస్తాయని అందులో పేర్కొన్నారు. అయితే, ఇదంతా ఫేక్ అని, ఇలాంటి లింక్స్ మీద క్లిక్ చేసి మోసపోవద్దని ఫ్యాక్ట్ చెక్ విద్యార్థులను హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version