చంద్రబాబే స్టీల్ ప్లాంట్ కు ఊపిరిపోశారు : మంత్రి అనిత

-

విజయనగరం జిల్లాలో ఎనబై శాతం రోడ్లు పూర్తి అయ్యాయి. ఈ నెలాఖరికి 100 శాతం పూర్తి చేస్తాము అని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. పవన్ కళ్యాణ్ పంచాయితీ రాజ్ మంత్రి అయ్యాక ఎన్ ఆర్ ఈ జీఎస్ వందల కోట్లతో పనులు చేపట్టాము. ప్రీ హోల్డ్ భూములపై క్యాబినెట్ లో చర్చించాం. జిల్లాలో రెవెన్యూ అధికారులతో మాట్లాడాం‌. ఎవ్వరికి కొమ్ముకాయకుండా రెవెన్యూ సిబ్బంది పని చెయ్యాలని అధికారులను ఆదేశించాం. ఎవ్వరిదీ ఒక సెంటు భూము కూడా తప్పు జరగ కూడదని చెప్పాం. లాంగ్ స్టాండింగ్ ఉన్న అధికారులను బదిలీ చేసేశాం. గత ప్రభుత్వంలో ఆరోపణలు ఉన్న అధికారుపై విచారణకు ఆదేశాలు ఇచ్చాం.

ఇక ప్రతి పక్షాలు విశాఖ స్టీల్ పై బురద జల్లుతున్నారు. పోరాటం చేసిన వ్యక్తి లపై తప్పుడు కేసులు పెట్టారు. విజయ సాయి రెడ్డి ఏం చెయ్యలేక పాదయాత్ర చేసారు. జగన్ కేసు నుంచి వెసులుబాటు కోసం ఢిల్లీ వెళ్లేవారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వస్తే కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారు. కేంద్రాన్ని చంద్రబాబు కలియడంతోనే స్టీల్ ప్లాంట్ కు ఊపిరి వచ్చింది. చంద్రబాబే స్టీల్ ప్లాంట్ కు ఊపిరిపోశారు. ప్రైయివేటైజేసన్ చేసే ఆలోచన లేక కనకనే కేంద్ర నుంచి ప్యాకేజీని తీసుకొచ్చాం అని హోం మంత్రి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version