మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఫిక్స్ అయింది. నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం జరుగనుంది. ముంబై ఆజాద్ గ్రౌండ్స్ లో మహా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు దేవేంద్ర ఫడ్నవీస్.
మహారాష్ట్ర సీఎంగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు దేవేంద్ర ఫడ్నవీస్. 2014 నుంచి 2019 వరకు తొలిసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు దేవేంద్ర ఫడ్నవీస్. రెండో సారి 2019 లో 5 రోజుల పాటూ ముఖ్యమంత్రి పని చేశారు దేవేంద్ర ఫడ్నవీస్. మహా సర్కార్ ఏర్పాటు కార్యక్రమానికి హాజరు కానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్డీయే నేతలు. అయితే… నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలోనే.. బీజేపీ పార్టీకి షాక్ తగిలింది. నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారానికి ఏక్ నాథ్ షిండే రావడం లేదట. ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో.. రావడం లేదని అంటున్నారు.