కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఫోన్ టాపింగ్ పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ఒక ప్రజా ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసేందుకు వెనుకడుతరు, మళ్ళీ ఉల్టా కేసు బనాయిస్తరు ? అంటూ ఆగ్రహించారు. ఇదేం విడ్డూరం….ఇదెక్కడి న్యాయం? ఇదేం ప్రజాస్వామ్యం? రేవంత్ మీ పాలన మార్పు మార్కు ఇదేనా? అంటూ ఫైర్ అయ్యారు.
రాజ్యాంగాన్ని కాపాడుదామని రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతడు….నువ్వేమో తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూనే ఉంటవని నిలదీశారు. ప్రజల తరుపున పోరాటం చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడతామంటే అదిరేది లేదు, బెదిరేది లేదన్నారు. ప్రజా క్షేత్రంలో నిన్ను నిలదీస్తూనే ఉంటాం. నీ వెంట పడుతూనే ఉంటామని హెచ్చరించారు మాజీ మంత్రి హరీష్ రావు.