World Cup 2023 : పాకిస్తాన్ క్రికెటర్‌కు బంపర్ ఆఫర్

-

CWC-2023 : నిన్న NZపై పాకిస్తాన్ గెలవడంతో కీలకపాత్ర పోషించిన ఓపెనర్‌ ఫకర్ జమాన్ కు ఆ దేశ క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్ ప్రకటించింది. జమాన్ కు 1 మిలియన్ (పాకిస్తానీ రూపాయి) రివార్డు ఇస్తామని పిసిబి చైర్మన్ జకా ఆశ్రఫ్ అనౌన్స్ చేశారు. నిన్న ఈ ఓపెనర్ మ్యాచ్ విన్నింగ్ సెంచరీ చేశాడు.

Fakhar Zaman slams Pakistan’s fastest World Cup century

81 బంతుల్లో 11 సిక్సర్లు, 8 ఫోర్లతో 126* పరుగులు చేశాడు. WCలో పాకిస్తాన్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్ లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసి భారీ టార్గెట్ ను పాకిస్తాన్ ముందు ఉంచింది. రచిన్ రవీంద్ర (108), విలియమ్సన్ (95), ఫిలిప్స్ (41) లు రాణించారు. ఇక పాక్ బౌలర్లలో మహమ్మద్ వసీం ఒక్కడే మూడు వికెట్లు తీసి న్యూజిలాండ్ ను కాస్త అడ్డుకోగలిగాడు. అయితే.. పాకిస్థాన్‌ బ్యాటింగ్‌ సమయంలో వర్షం వచ్చింది. దీంతో డక్‌ వర్త్‌ లూయిస్‌ ప్రకారం.. పాక్‌ విజేతగా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news