ఇండియా – పాక్ మ్యాచ్ కోసం ఆస్పత్రి బెడ్లూ !

-

ఏడాది వన్డే WCలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. గుజరాత్-అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగే మ్యాచ్ కోసం అక్కడి హోటల్ రూమ్ లు అన్ని బుక్ అయిపోయాయి. 5 స్టార్ హోటల్ రూమ్ చార్జీ ఒక రాత్రికి రూ.1,00,000 గా ఉండడంతో ఫ్యాన్స్ తెలివిగా ఆలోచిస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రిలో ఫుల్ బాడీ చెకప్, ఓవర్ నైట్ స్టే బుక్ చేసుకుంటున్నారు. దీంతో తక్కువ ధరలోనే రూమ్ పొందుతున్నారు.

కాగా, టీమిండియాను ఎక్కడైనా ఓడిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు పాక్ మాజీ ప్లేయర్ వకార్ యూనిస్. ఆసియాకప్ లో భాగంగా శ్రీలంకలో, డబ్ల్యూసిలో భాగంగా అహ్మదాబాద్ లో టీమిండియాపై పాకిస్తాన్ మ్యాచ్లు ఉన్న నేపథ్యంలో పాక్ మాజీ పెసర్ వకార్ యూనిస్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.‘టీమిండియాను ఓవల్ లో ఓడించాం. కాబట్టి ఎక్కడైనా ఓడిస్తాం. ఎక్కడ ఆడుతున్నామనేది ముఖ్యం కాదు’ అని వాక్యానించారు. కాగా, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో ఇంగ్లాండ్ లోని ఓవల్ మైదానంలో టీమిండియాపై పాకిస్తాన్ 180 రన్స్ తేడాతో గెలిచింది. కాగా, ఇటీవల కాలంలోనే ఆసియా కప్‌ షెడ్యూల్‌ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ ఆసియా కప్‌ లో భాగంగా… టీమిండియా మరియు పాకిస్థాన్‌ జట్ల మధ్య శ్రీలంకలో మొదటి మ్యాచ్‌ జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version