రైతులా మజాకా.. టియర్‌ గ్యాస్‌ డ్రోన్లకు పతంగులతో చెక్‌

-

పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతులు దిల్లీ చలో ఆందోళనను చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రైతులను దిల్లీ సరిహద్దుల్లోనే నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హర్యానా శివారు ప్రాంతంలో రైతులను అడ్డుకున్న భద్రతా బలగాలు.. రోడ్డుపై ఉంచిన కాంక్రీటు దిమ్మెలు, బారికేడ్లు, ఇనుప కంచెలను తొలగించేందుకు ప్రయత్నించిన రైతులపై టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించాయి. రైతులు రాళ్ల దాడి చేయడంతో శంభు సరిహద్దుల్లోని అంబాలా వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.

అయితే రైతులు టియర్ గ్యాస్ విడుదల చేస్తున్న డ్రోన్లకు చెక్ పెట్టేందుకు వినూత్న ఆలోచన చేశారు. కొందరు రైతులు డ్రోన్‌ రోటర్లు తిరగకుండా పతంగులను ఎగరేస్తున్నారు. ఈ వీడియోలు కాస్త నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఈసారి కూడా రైతులు కేంద్రం కిందకు దిగొచ్చే వరకు ఆందోళన ఆపేలా లేరని, పక్కా ప్లాన్ తో వచ్చారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు రైతుల ఆందోళ నేపథ్యంలో లారీ డ్రైవర్లు తిప్పలు పడుతున్నారు. పంజాబ్‌-హర్యానా రహదారిపై పెద్ద ఎత్తున ట్రాక్టర్లు నిలపడంతో సరకు రవాణా చేసే ట్రక్‌ డ్రైవర్లు గత మూడు రోజులుగా తమ వాహనాలను రోడ్డు పక్కన నిలిపివేసినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version