ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది విద్యార్థులు మృతి

-

మణిపూర్ లోని నోనె జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్టడీ టూర్ కోసం ఇంఫాల్ నుంచి స్కూల్ విద్యార్థులతో వెళుతున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు మరణించారు. మరి కొంతమంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బాధితులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్టడీ టూర్ కోసం ఇంపాల్ నుంచి బస్సు బయలుదేరింది. ఈ ఘటనతో ఆ ప్రదేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version