కంప్యూటర్ ఇన్ స్టిట్యూట్ లో అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న విద్యార్థులు

-

అస్సాం లోని సిల్చార్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సిల్చార్ లోని ఒక భవనంలో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ని నడుపుతున్నారు. కాగా ఆ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. అయితే మంటలు వ్యాపించిన సమయంలో తరగతి గదిలో విద్యార్థులు ఉన్నారు. దీనితో విద్యార్థులందరూ మంటల్లో చిక్కుకున్నారు. కాగా ఈప్రమాదం గురించి స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందిచారు.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అలానే మంటల్లో చిక్కుకున్న విద్యార్థులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే మంటల్లో చిక్కుకున్న విద్యార్థుల్లో కొందరు బయాందోళనకు గురై కిటికీలో నుండి కిందకి దూకుతున్నారు. కాగా అగ్నిప్రమాదం షార్ట్సర్క్యూట్ కారణంగానే జరిగినట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version