మణిపూర్ లో కాల్పుల కలకలం

-

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో అల్లర్లు కొనసాగుతున్నాయి. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని రెండు గ్రామాలలో పలువురు వ్యక్తులు తుపాకీ, బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసిందని పోలీసులు తెలిపారు. సనాసాభి, తప్నాపోక్పి గ్రామాలలో జరిగిన దాడుల్లో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.

భద్రతా బలగాలు కూడా ఎదురు కల్పులు జరిపాయని పేర్కొన్నారు. డిసెంబర్ 25 క్రిస్మస్ వేల కూడా మణిపూర్ లో హింస చెలరేగింది. కింగ్ పోక్పి జిల్లాలోని సినమ్ కోమ్ గ్రామంలో ఉదయం 6:30 గంటల సమయంలో కొందరు దుండగులు కాల్పులు జరిపారు. కొండ ప్రాంతంలో విలేజ్ వాలంటీర్స్ పేరుతో కొందరు బాంబు దాడులకు పాల్పడుతూ కాల్పులు జరిపారని స్థానికులు పేర్కొన్నారు.

దీంతో భద్రతా బలగాలు హుటాహుటిన రంగంలోకి దిగాయి. మరోవైపు చూరాచంద్ పూర్ జిల్లా లెయి సంగ్ గ్రామంలోని బ్రిడ్జ్ కింద దుండగులు అమర్చిన 3.6 కేజీల పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. హింసాత్మక ఘటనలు, కాల్పులతో మణిపూర్ నిత్యం దద్దరిల్లిపోతోంది. కేంద్ర బలగాలు రంగంలోకి దిగిన పరిస్థితి మారడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news