భారత్ లో తొలి ఓమిక్రాన్ మరణం మహారాష్ట్రలో నమోదు అయినట్టు తెలుస్తుంది. ఈ నెల 28నే ఓమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తి మరణించాడని ఒక జాతీయ వార్త సంస్థ తెలిపింది. మహారాష్ట్రకు చెందిన యశ్వంత్ చవాన్ ఇటీవల నైజీరియా నుంచి తిరిగి వచ్చాడు. ఆ వ్యక్తికి హార్ట్ అటాక్ రావడంతో మహారాష్ట్రలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే యశ్వంత్ చవాన్ కు ఈ నెల 28న మరణించాడు. అతనికి ఓమిక్రాన్ వేరియంట్ కూడా సోకింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరోనా మరణం కాకుండా ఇతర కారణాలతో మరణించాడని రిపోర్ట్ చేసింది.
అయితే ఆ వ్యక్తికి గత 13 సంవత్సరాల నుంచి షూగుర్ ఉందని అలాగే హార్ట్ అటాక్ కూడా వచ్చిందని మహారాష్ట్ర వైద్య ఆరోగ్య అధికారులు తెలిపారు. దీని వల్లే చనిపోయాడని తెలిపారు. మరణం తర్వాత అతని శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపిస్తే.. యాదృచ్ఛికంగా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. అతను పూర్తిగా ఓమిక్రాన్ తో మరణించ లేదని ఇతర కారణాలతో మరణించాడని తెలిపారు. కానీ ఒక జాతీయ వార్త సంస్థ మాత్రం ఆ వ్యక్తి ఓమిక్రాన్ సోకడం వల్ల మరణించాడని ప్రచురించింది.
A 52-year-old man with a travel history to Nigeria died of heart attack in Pimpri Chinchwad on Dec 28. The death of the patient is due to non-COVID reasons. Today's NIV report reveals that he was infected with #Omicron variant of coronavirus: Maharashtra Health Department https://t.co/14UzGVEj87
— ANI (@ANI) December 30, 2021