నీతీశ్ కుమార్‌కు షాక్.. ఐదుగురు కూటమి ఎమ్మెల్యేలు మిస్సింగ్!

-

బిహార్లోని రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి మారుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఇటీవలే ఏర్పడ్డ ఎన్డీఏ కూటమి ఇవాళ బలపరీక్ష ఎదుర్కోనుంది. ఈ క్రమంలో ఉత్కంఠ కొనసాగుతోంది. 243 మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజార్టీ మార్క్‌ 122గా ఉంది. బలపరీక్షలో తమ కూటమికి 127 ఓట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్న బీజేపీకి, నీతీశ్ కుమార్‌కు షాక్ తగిలింది.

అధికార కూటమికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు అదృశ్యం కావడం ఇప్పుడు ఆ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఈ ఐదుగురు ఎమ్మెల్యేల అదృశ్యంతో బలపరీక్షలో నీతీశ్ ఓడిపోయే ఛాన్స్ ఉండటంతో ఆ కూటమి ఇప్పుడు ప్రత్యామ్నాయంపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే హిందూస్థానీ అవామీ మోర్చా జితన్ రామ్ మాంఝీపై కూటమి ఫోకస్ చేస్తోంది. ఆయన పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు అధికార కూటమికి మద్దతు ప్రకటిస్తే నీతీశ్ సర్కార్ బలపరీక్షలో నెగ్గుతుంది.

మరోవైపు ఆర్జేడీ ఎమ్మెల్యేలు చేతన్ ఆనంద్, నీలం దేవి, ప్రహ్లాద్ యాదవ్ అసెంబ్లీలో ప్రభుత్వ పక్షాన కూర్చున్నారు. అయితే ఓటింగ్‌ ముగిసే వరకు ఎమ్మెల్యేలు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని, లేకుంటే ఓటు చెల్లుబాటు కాదని మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news