Kcr అలా చేస్తే బాగుండేది: రేవంత్ రెడ్డి

-

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం హాట్ టాపిక్ గా మారాయి. కృష్ణా జలాల వినియోగం పై రేవంత్ సర్కార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది తర్వాత సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కృష్ణా బేసిస్ లోని సాగునీటి ప్రాజెక్టులను బోర్డుకి అప్పగించే ప్రసక్తి లేదని రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానం మీద బీఆర్ఎస్ వైఖరి ఏంటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కృష్ణానది పరివాహక ప్రాంతం జనాభా లెక్కలన్నీ గమనంలోకి తీసుకుంటే 68% నీటి వాటా తెలంగాణకి రావాల్సి ఉంది.

Telangana Assembly Session 2024

ఇప్పుడు 551 టిఎంసిలు రాష్ట్రానికి దక్కాల్సి ఉందని దీనికోసం డిమాండ్ చేయాలన్న తీర్మానానికి బిఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తుందని ప్రశ్నించారు. ఈ రెండిటికి ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు గతంలో మహబూబ్నగర్ ఎంపీగా గెలిచిన కేసీఆర్ కృష్ణా జలాలకి అన్యాయం చేశారని ఇప్పుడు వివరణ ఇవ్వడానికి కూడా సభకు రాకుండా ఫామ్ హౌస్ లో ఉన్నారని చర్చలో పాల్గొనే వాస్తవాలను వివరించే ప్రభుత్వ తీర్మానంపై విధాన నిర్ణయాన్ని ప్రకటించి ఉండాల్సిందని అన్నారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news