మద్యం దుకాణంపై పేడ విసిరిన మాజీ సీఎం ఉమా భారతి

-

మద్యపానాన్ని నిషేధించాలంటూ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి గత కొంత కాలంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇది కూడా ఆమె తన సొంత ప్రభుత్వంపైనే ఇదంతా చేస్తోంది. ఈసారి భిన్నంగా తన పోరాటాన్ని చూపించి మరోసారి వార్తల్లో నిలిచారు ఉమాభారతి. తాజాగా మద్యాన్ని సంపూర్ణంగా నిషేధించాలని ఆమె చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మధ్యప్రదేశ్ లోని నివారి జిల్లా ఓర్చా పట్టణంలో ఓ మద్యం దుకాణాలపై ఆవుపేడ విసిరారు ఉమాభారతి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. పేడ విసరడమే కాదు దుకాణం పైకి రాళ్ళు కూడా రువ్వుతున్నాను అని వీడియో తీస్తున్న వ్యక్తి తో ఉమాభారతి అంటూ కనిపించారు. దాంతో దుకాణాన్ని యజమాని తాత్కాలికంగా మూసేశారు. గతంలోనూ ఉమాభారతి భూపాల్ లోని ఓ మద్యం దుకాణం లోకి వెళ్లి బాటిళ్ల పై రాళ్లువిసిరి పగలగొట్టిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news