కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్యకు గురయ్యాడు. బెంగళూరులోని HSR లేఔట్‌లో ఉంటున్న మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్యకు గురయ్యాడు. అయితే ఈ సంఘటన నేపథ్యంలో కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ భార్యపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

భార్య పల్లవి, కుమార్తెను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. కుటుంబ కలహాల కారణంగానే హత్య జరిగినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటన పై బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద్ మాట్లాడుతూ, మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ మృతదేహం రక్తపు మడుగులో కనిపించిందని పేర్కొన్నారు. పదునైన ఆయుధాన్ని ఉపయోగించి అతన్నీ హత్య చేసి ఉండవచ్చని అన్నారు.
ఈ రోజు సాయంత్రం 4-4.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన పై సమాచారం వచ్చిందన్నారు. మా మాజీ డీజీపీ, ఐజీపీ ఓం ప్రకాష్ మరణం గురించి మాకు సమాచారం అందింది. ఆయన కుమారుడి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసమన్నారు. వివరణాత్మక దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతానికి ఎవరినీ అరెస్టు చేయలేదు” అని ఆయన అన్నారు.