గులాబీ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీపై దాడికి కుట్రలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీపై దాడి జరగబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. నిన్న సాయంత్రం 5 గంటలకు నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేస్తారని వాట్సప్‌లో మెసేజ్ పెట్టిన గుర్తు తెలియని వ్యక్తి… ఎమ్మెల్యే గోశాలకు వెళ్లే సమయంలో దాడికి ప్లాన్ చేశారని పేర్కొన్నాడు.

దాడికి ప్లాన్ చేసిన వారిపై గతంలో అక్రమ ఆయుధాల కేసులు ఉన్నాయని స్పష్టం చేసాడు. అరవింద్ కుమార్, సాయి రితీష్ రెడ్డి, కోలా వంశీ, గుళ్ల నాగరాజులు దాడి చేస్తారంటూ వారి ఫోన్ నంబర్లు చెప్పాడు. అయితే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆరోపణలు ఎదుర్కొన్న వారు చెబుతున్నారు.