హారతి ఇస్తుండగా మంటలు.. మాజీ కేంద్ర మంత్రికి తీవ్ర గాయాలు

-

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. రాజస్తాన్ లోని ఉధయ్ పూర్ లో తన నివాసంలో పూజ సమయంలో హారతి ఇస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో గాయాలయ్యాయి. కుటుంబ సబ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం ఆమెను అహ్మదాబాద్ కి తరలించాలని సూచించినట్టు సమాచారం.

ఇంట్లో ఆమె హారతి ఇస్తుండగా.. కింద వెలుగుతున్నటువంటి దీపం నుంచి మంటలు ఆమె దుపట్టాకు అంటుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు గిరిజా వ్యాస్ సోదరుడు గోపాల్ శర్మ తెలిపారు. కుటుంబ సభ్యలుు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారన్నారు. ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలైన గిరాజా వ్యాస్ గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిగా సేవలందించారు. రాజస్థాన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా, జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా పని చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news