సాధారణంగా ప్రస్తుతం నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎంతో శ్రమించినా ఉద్యోగం దక్కడం లేదు. ఉద్యోగం దక్కితేనే పెళ్లి చేసుకోవాలని ఆశించే వారు చాలా మంది ఉన్నారు. కొంత మంది 40 ఏళ్లు వచ్చినా ఉద్యోగం రావాలని వేచి చూస్తూనే ఉన్నారు. మరికొందరూ అయితే చాలా త్వరగా ఉద్యోగం సాధిస్తుంటారు. అంకిత భావంతో కష్టపడితే అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయవచ్చని నిరూపిస్తున్నారు కొందరూ యువతి, యువకులు. ప్రభుత్వ ఉద్యోగాలు పోస్టులు వందల్లో ఉంటే.. పోటీ లక్షల్లో ఉంటున్న విషయం మనకు తెలిసిందే.
ఇలాంటి హెవీ కాంపిటేషన్ లో కూడా ఓ యువకుడు ఏకంగా 10 ఉద్యోగాలను సాధించి యువతకు ఆదర్శంగా నిలిచాడు. ఇంతకి అతను ఎవరంటే.. భూపాలపల్లి జిల్లాకు చెందిన వి.గోపికృష్ణ. ఉద్యోగాలే ఆయన కోసం క్యూ కట్టినట్టుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకున్నాడు. ఏకంగా 10 ఉద్యోగాలను సాధించాడు. తాజాగా TGPSC ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాల్లో 70వ ర్యాంకు సాధించి భలా అనిపించుకున్నాడు. గోపి ఇప్పటి వరకు 7 కేంద్ర ప్రభుత్వ, 3 రాస్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. గోపి ప్రస్తుతం మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ గా శిక్షణ పొందుతున్నాడు. త్వరలో గ్రూపు-1 పోస్టులో జాయిన్ అవుతానని మీడితో తెలిపాడు.