ఈనెల 12 నుంచి G-20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు

-

ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు దిల్లీలో G20 దేశాల 9వ పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు జరగనుంది. ద్వారకాలో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌ యశోభూమి ఈ సదస్సుకు వేదిక కానుందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా వెల్లడించారు. ఈ సదస్సులో జర్మనీ, అర్జెంటీనా మినహా మిగిలిన జి20 సభ్యదేశాలు, 9 ఆహ్వానిత దేశాల సభాపతులు, ఇంటర్‌పార్లమెంటరీ యూనియన్‌, కామన్‌వెల్త్‌ పార్లమెంటరీ అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. మొత్తం 50 మంది పార్లమెంటు సభ్యులు, 26 మంది స్పీకర్లు, 10 మంది డిప్యూటీ స్పీకర్లు, 14 మంది సెక్రటరీ జనరళ్లు, 1 కమిటీ ఛైర్మన్‌, 1 ఇంటర్‌ పార్లమెంటరీ యూనియన్‌ ప్రెసిడెంట్‌ వస్తున్నట్లు పేర్కొన్నారు.

తొలిసారి ఆఫ్రికన్‌ పార్లమెంట్‌ ప్రెసిడెంట్‌ ఈ సదస్సులో పాల్గొంటున్నారు. గతంలో ఏ సదస్సుకూ హాజరుకానంత మంది ప్రతినిధులు దీనికి హాజరుకాబోతున్నారు.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారం చూపే దిశగా ఇందులో చర్చలు నిర్వహించనున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా వెల్లించారు. వివిధ పార్లమెంటుల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలపై చర్చించనున్నట్లు తెలిపారు. మూడ్రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో… 1. 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన, 2. పబ్లిక్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు, 3. మహిళాధారిత అభివృద్ధి, 4. సుస్థిర ఇంధనం దిశగా రూపాంతరం అనే అంశాలపై చర్చ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version