హీరోగా యాంకర్ సుమ తనయుడు.. సినిమా టైటిల్ ప్రకటించిన రాజమౌళి

-

యాంకర్ సుమ, నటుడు రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌ హీరోగా టాలీవుడ్​లో ఎంట్రీ ఇస్తున్నాడు. తన తొలి సినిమాకు సంతకం కూడా చేశాడు రోషన్. ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపుతూ.. నటుడిగా రోషన్‌ తనదైన మార్క్‌ చూపించాలని, తల్లిదండ్రులు సుమ, రాజీవ్‌ గర్వపడేలా చేయాలని ట్వీట్ చేశారు.

రాజమౌళి ట్వీట్ పై స్పందించిన రోషన్‌.. జక్కన్నకు కృతజ్ఞతలు తెలిపాడు. ‘మీ ప్రతి సినిమా నాపై ఎంతో ప్రభావం చూపింది’ అని రీ ట్వీట్ చేశాడు. ఇంతకీ సినిమా టైటిల్ ఏంటో తెలుసా…. ‘బబుల్ గమ్‌’ . పేరుకు తగ్గట్లు సంబంధిత పోస్టర్‌లో బబుల్‌ గమ్‌ నములుతూ కనిపించాడు రోషన్‌. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్​గా కనిపిస్తోంది. పోస్టర్ చూస్తుంటే యువతనే టార్గెట్ చేసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిజ్‌ లీల’ చిత్రాలతో మెప్పించిన డైరెక్టర్.. రవికాంత్‌ పేరేపు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. రోషన్‌ కు జంటగా చెరుకూరి మానస చౌదరి నటిస్తోంది. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 10న గ్లింప్స్‌ను విడుదల చేయనన్నట్లు చిత్ర బృందం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version