విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోండి అని టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గంభీర్ ప్రశంసలు కురిపించారు. ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ కామెంటేటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించారు. ‘విరాట్, రాహుల్ ఒత్తిడిని జయించారు.
ఫిట్నెస్, వికెట్ల మధ్య పరుగులో యంగ్ స్టర్లు కోహ్లీని చూసి నేర్చుకోవాలి. విరాట్ బాల్స్ ను తగ్గించుకుంటూ స్ట్రైక్ రోటేట్ చేశాడు. బౌలర్ల పై ఒత్తిడి పెంచాడు’ అని గంభీర్ కొనియాడారు. కాగా, వరల్డ్ కప్ లో భారత్ బోనీ కొట్టింది. ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 200 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియాను ఆసీస్ మొదట్లోనే మూడు వికెట్లు తీసి దెబ్బకొట్టింది. తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ(85), రాహుల్(97*) భారత్ ను విజయతీరాలకు చేర్చారు. చివర్లో కోహ్లీ అవుట్ కాగా…. పాండ్యా(11*)తో కలిసి రాహుల్ ఇండియాను గెలిపించారు. 41.2 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని చేదించి, అదరహో అనిపించింది.