సామాన్యులకు ఊహించిన షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిపోయాయి. ఆగస్టు ఒకటో తేదీ కావడంతో.. చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను మార్చుతూ ఉంటాయి. ఈ తరుణంలోనే దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెరిగాయి. గ్యాస్ సంస్థలు.
…వంట గ్యాస్ ధరలను అమాంతం పెంచేశాయి.
తాజాగా పెరిగిన ధరల వివరాల ప్రకారం… 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై 7.50 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటన చేశాయి. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచి అంటే ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తాయి. అంతేకాకుండా ఈ పెంపుతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ద్వారా 1653.50 రూపాయలకు చేరింది.
అటు హైదరాబాద్ మహానగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1896 గా నడుస్తోంది. ఇక ఇదంతా పక్కకు పెడితే గృహ అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు చమురు కంపెనీలు. దీంతో సామాన్య ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఎలక్షన్ పూర్తయిన నేపథ్యంలో ఈ ధరలు పెంచుతున్నట్లు తెలుస్తోంది.