భారత మాజీ క్రికెటర్‌ అన్షుమన్‌ గైక్వాడ్‌(72) కన్నుమూత

-

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్, కోచ్‌ అన్షుమన్‌ గైక్వాడ్‌(71) కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న అన్షుమన్‌ బుధవారం రాత్రి మరణించారు. ఇటీవల అన్షుమన్ చికిత్స కోసం బీసీసీఐని కపిల్‌దేవ్‌ సాయం కోరిన విషయం తెలిసిందే. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న గైక్వాడ్‌ కొన్ని నెలల పాటు లండన్‌లో చికిత్స పొంది గత నెలలో స్వదేశానికి వచ్చి బరోడాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స కొనసాగించారు. కపిల్‌ దేవ్‌ సహా పలువురు మాజీ క్రికెటర్ల విజ్ఞప్తి మేరకు గైక్వాడ్‌ చికిత్స కోసం కొన్ని రోజుల కిందటే బీసీసీఐ రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించింది. చికిత్స పొందుతూనే ఆయన బుధవారం కన్నుమూశారు.

భారత్‌ తరఫున అన్షుమన్‌ గైక్వాడ్‌ 40 టెస్టులు, 15 వన్డేలు ఆడారు. 1974 నుంచి 1984 భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. జాతీయ క్రికెట్‌ జట్టుకు రెండుసార్లు కోచ్‌గా సేవలందించారు. మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్‌ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. భారత క్రికెట్‌లో అన్షుమన్ సేవలు చిరకాలం గుర్తుంటాయని పేర్కొన్నారు. అన్షుమన్ మృతిపట్ల పలువురు క్రికెట్ దిగ్గజాలు కూడా సంతాపం ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news