తొమ్మిదేళ్ల బాలికపై ఎద్దులు భీకరంగా దాడి చేశాయి. ఆ బాలికను కొమ్ములతో అమాంతం లేపి కిందకు విసిరేసి పొడిచాయి. అది చూసిన స్థానికులు మొదట ఎద్దులను అడ్డుకోవడానికి భయపడ్డారు. కానీ బాలిక బాధతో కేకలు వేయడంతో కాస్త ధైర్యం తెచ్చుకుని ఎద్దులను తరిమికొట్టి.. ఆమెను రక్షించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే..?
తమిళనాడులోని చెన్నై అరుంబాక్కం పోలీస్ స్టేషన్ పరిధిలోని చూలైమేడులో నాలుగో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక తన తల్లితో కలిసి పాఠశాలకు వెళ్తోంది. ఈ క్రమంలో.. వారి ముందు నడుస్తున్న ఎద్దులు ఒక్క సారిగా బాలికపై దాడి చేశాయి. కొమ్ములతో అమాంతం ఎత్తి నేలపైకి విసిరేశాయి. అనంతరం బాలికపై పలుమార్లు భీకరంగా దాడి చేశాయి. బాలిక, ఆమె తల్లి.. అక్కడున్న వారు కేకలు వేసినా ఎద్దు విడిచిపెట్టలేదు. అనంతరం అక్కడున్న వారు ఎద్దుపైకి రాళ్లు రువ్వి బాలికను రక్షించారు. వెంటనే బాధితురాలిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
Video: (warning ) A school girl being attacked by a cow in MMDA colony, #Chennai. She survived with stitches. #Cowattack @dt_next @chennaipolice_ @chennaicorp pic.twitter.com/UMlJawj91k
— Raghu VP / ரகு வி பி / രഘു വി പി (@Raghuvp99) August 10, 2023