ఆడపిల్లలకు ఆస్తి హక్కుపై సుప్రీం కోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. ఆడపిల్లలకు ఆస్తిలో సమాన వాటా పంచాల్సిందే అని స్పష్టం చేసింది. చట్టం అమల్లోకి వచ్చే నాటికి తండ్రి బ్రతికి ఉన్నా లేకపోయినా సరే ఆస్తిలో సమాన వాటా ఉండాలి అని స్పష్టం చేసింది. 2005 సెప్టెంబర్ 9 నాటికి తండ్రి బ్రతికి ఉన్నా లేకపోయినా సరే సమాన హక్కు అనేది అడపిల్లలకు ఆస్తిలో ఉండాలి అని తీర్పు ఇచ్చింది.
సవరణ ప్రకారం ఆస్తిలో సమాన హక్కు ఆడ పిల్లలకు ఉంటుంది అని పేర్కొంది. హిందుత్వ వారసత్వ సవరణ చట్టం పై సుప్రీం కోర్ట్ ఈ తీర్పు ఇచ్చింది. ఆడ పిల్లలకు ఆస్తి ఇచ్చే విషయంలో కొందరు తల్లి తండ్రులు పక్ష పాతం చూపిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కడే కొడుకు ఉంటే కొడుకుకి ఎక్కువ ఆస్తి ఉంచి ఆడపిల్లలకు 10 శాతం నుంచి 30 శాతం వరకే ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.