అమెరికా దెబ్బకు భయపడుతున్న జగన్ !

-

స్కూళ్లు ప్రారంభమైన రెండు వారాల్లోనే అమెరికాలో 97 వేల మంది చిన్నారులకు కరోనా రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. అమెరికాలో గడచిన రెండు వారాల్లో ఒక్క అమెరికాలోనే 97 వేల మంది చిన్నారులు కరోనా వైరస్ బారిన పడ్డారని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సంస్థ తెలిపింది. జూలై 16 నుంచి జూలై 30 మధ్య దాదాపు లక్ష మంది పిల్లలకు ఈ వైరస్ సోకిందని, దీంతో స్కూళ్లను తిరిగి తెరిపించడంపై అధికారులు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. అమెరికాలో ఇప్పటివరకూ కరోనా కారణంగా దాదాపు 25 వేల మందికి పైగా పిల్లలు చనిపోయారని గణాంకాలు చెబుతున్నాయి.

jagan
jagan

అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన ఏపీలో ప్రభుత్వ స్కూళ్లను తెరవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అదే రోజున జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని కూడ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ వార్త బయటకు రావడంతో స్కూల్స్ తెరిచే విషయం మీద మళ్ళీ పునరాలోచిస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే సంబందింత అధికారులకి జగన్ సూచనలు చేసినట్టుగా చెబుతున్నారు. నిజానికి ఈ ఏడాది ఆన్ లైన్ క్లాసులను మాత్రమే జరిపించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. వైరస్ ఇంకా అదుపులోకి రాకపోవడంతో వ్యాక్సిన్ వచ్చేంత వరకూ స్కూళ్లు వద్దని కోరుతున్నారు. ఒకవేళ స్కూల్స్ తెరిచినా త‌ల్లిదండ్రులు త‌మ పిల్లలను పంపేలా లేరు. మరి ఈ విషయం మీద ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news