రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..!

ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది రైల్వే Railway ప్రయాణికులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఇండియన్ రైల్వేస్ కొత్త నిర్ణయం తీసుకుంది.

రైల్వే /Railway
రైల్వే /Railway

రెండు వీక్లీ ట్రైన్స్‌ ని స్టార్ట్ చెయ్యడానికి సిద్ధం అవుతోంది. దక్షిణ మధ్య రైల్వేస్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా చెప్పడం జరిగింది. దీంతో రైల్వే ప్రయాణికులకు రిలీఫ్ కలిగిందనే చెప్పాలి.
దక్షిణ మధ్య రైల్వేస్ రెండు వీక్లి స్పెషల్ ట్రైన్స్ నడపనుంది.

ఇక వాటి వివరాల లోకి వెళితే.. పుదుచెర్రీ నుంచి ఢిల్లీ స్పెషల్ ట్రైన్, కన్యాకుమారి నుంచి శ్రీ మాతా వైష్టో దేవీ ట్రైన్ స్టార్ట్ కానుంది. ఇవి జూలై 11, జూలై 9 నుంచి మొదలవ్వనున్నాయి. ఇది ఇలా ఉంటే న్యూఢిల్లీ – పుదుచెర్రీ వీక్లి సూపర్ ఫాస్ట్ స్పెషల్ ట్రైన్ జూలై 11న ప్రారంభమౌతుంది. అలాగే జూలై 14న ఇది పుదుచెర్రీ నుంచి న్యూఢిల్లీ వెళ్తుంది.

ఈ ట్రైన్ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమౌతాయి. అలానే ఈ ట్రైన్ వరంగల్, విజయవాడ జంక్షన్, గూడూరు జంక్షన్ల మీదుగా వెళ్లనుంది. అలానే జూలై 9న కన్యాకుమారి నుంచి శ్రీ మాతా వైష్టో దేవి కత్రా వీక్లి స్పెషల్ ట్రైన్ స్టార్ట్ అవ్వనుంది. జూలై 12న ఈ ట్రైన్ శ్రీ మాతా వైష్టో దేవీ కత్రా నుంచి బయలుదేరి కన్యాకుమారి చేరుతుంది.