శుభవార్త: రైతుల అకౌంట్లలోకి డబ్బులు.. వివరాలు ఇవే..!

-

రైతు(farmers) ల కోసం పలు స్కీమ్స్ ఉండగా.. వాటిలో పీఎం కిసాన్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ తో రైతులకి మంచి బెనిఫిట్ కలుగుతుంది. మోదీ సర్కార్ పీఎం కిసాన్ స్కీమ్ కింద మరోసారి అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

రైతు /farmers
రైతు /farmers

అన్నదాతలకు తీపికబురు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. మళ్లీ రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి సిద్ధం అవుతోంది. పీఎం కిసాన్ స్కీమ్ కింద ఈ డబ్బులు చేరనున్నాయి. దీంతో చాలా మంది రైతులకు రిలీఫ్ గా ఉంటుంది.

ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లోకి ఎనిమిది విడతల డబ్బులు వచ్చాయి. కాగా ఈసారి తొమ్మిదవ విడత డబ్బులు ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ నెలలో పీఎం కిసాన్ 9వ విడత డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుందని నివేదికలు ద్వారా తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే సర్కార్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేలు అందిస్తోంది. కానీ ఈ డబ్బులన్నీ ఒకేసారి రావు. విడతల వారీగా వస్తాయి. రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి చేరతాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news